అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల దర్శకుడిగా, దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. హీరోలు నాగార్జున, రామ్ చరణ్, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులు పాల్గొన్నారు.
హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ, ‘అనీష్ హీరోగా లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. నాగార్జున లాంటి సపోర్ట్ ఉంటే తప్పు జరగడానికి అవకాశం లేదు. అనీష్‌కి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు నాకు చూపించాడు. నేను నా ఫస్ట్ సినిమాకు ఎలా చేశానో తెలియదు కానీ, నాకంటే పది రెట్లు బెటర్‌గా చేశాడు. తన ప్రతి సీన్‌ను చాలా అద్భుతంగా చేశాడు. తనకు కచ్చితంగా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది.
మూగవాడిగా నటించినప్పటికీ అన్ని నవరసాలను పలికించాడు. నేను కూడా ‘రంగస్థలం’ సినిమాలో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం ఈ సినిమాతో అనీష్‌కు రావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘అనీష్ గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చేయమని అడిగాడు. తను సినిమాలో మూగవాడిగా నటిస్తున్నాడు. తొలి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం అవసరమా అని అడిగాను. రామ్ చరణ్ ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది. అఖిల్ ఆరో సినిమాకు బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు. అయితే ఈ కథ మీద అనీష్‌కు చాలా నమ్మకం ఉంది. నాకు సినిమా చూపించారు. సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. అనీష్ అద్భుతంగా తన పాత్రలో లీనమైపోయాడు. సినిమా చాలా బాగుంది. తన కళ్లతో మాట్లాడాడు. తన సైలెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది.
అలాగే తమన్ ఇచ్చిన ప్రతి పాట హిట్ అయింది’ అని నాగార్జున చెప్పారు.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, ‘డైరెక్టర్ మహేష్ చాలా కొత్త కథ రాశారు. మాటలు లేకుండా హీరో సినిమా చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిం చింది. అసలు దీన్ని ఎలా చేయబోతున్నారు అనుకున్నాను. నేను సినిమా చూశాను. అనీష్ చాలా అద్భుతంగా చేశాడు. సినిమాను కూడా చాలా అద్భుతంగా తీశారు. ఇది చాలా కమర్షియల్ సినిమా. థియేటర్‌లో చాలా అద్భుతంగా ఉంటుంది. అనీష్, అనస్వర కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. తమన్ నాకు ‘లెనిన్’ సినిమాకు ఇచ్చినట్టే ఈ సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. అనీష్‌కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి’ అని తెలిపారు.
‘రంగస్థలం’ రేంజ్‌లో...
4 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 10, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)