నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త మాస్ ఎంటర్‌టైనర్ ‘దాదా’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గతంలో ‘వీరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కావడంతో ఈ హై వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక ప్రకటనతో పాటు కలర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అలరించారు. ఈ పోస్టర్ ద్వారానే సినిమా ఫస్ట్ సింగిల్ టైటిల్‌ను ‘దాదా ధమాకా’గా ప్రకటించారు. ఈ పాటను ఈనెల 13న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీతం: ఎస్.తమన్, కెమెరా: అరవింద్ ఎస్. కశ్యప్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, వి. వెంకట్.






కామెంట్‌లు (0)