అల్లు అర్జున్ హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న చిత్రం ‘ఎఎ23’. ఈ సినిమాకి సంబంధించి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన అనౌన్స్‌మెంట్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఎప్పుడు వెల్లడవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ అప్‌డేట్‌ను షేర్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. లోకేష్ కనగరాజ్ షేర్ చేసిన ఫొటోలో అల్లు అర్జున్‌కు ఆయన ఏదో వివరిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొనగా, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు వెలువడనున్నాయి. హీరో అల్లు అర్జున్, తనదైన కథాకథనాలతో, వైవిధ్యమైన మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితులైన బన్నీ వాస్, సందీప్ రామినేని, నటరాజ్, స్వాతి సహ నిర్మాతలుగా ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు.







కామెంట్‌లు (0)