‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలోని క్రేజీ గ్యాంగ్ మళ్లీ కలుసుకోబోతున్న సమయం ఆసన్నమైంది. ఈ కల్ట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఈఎన్ఈ రిపీట్’ ఈనెల19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ ధాస్యం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి కలిసి నటిస్తున్నారు.
ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ‘‘పెళ్లి చూపులు’ విజయం తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, నా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నా చుట్టూ ఎప్పుడూ నలుగురు స్నేహితులు నన్ను అంటిపెట్టుకుని ఉండేవారు.
అలాంటి ఫ్రెండ్షిప్ గురించి సినిమా చేస్తే బాగుంటుందని చేసిన సినిమానే ‘ఈ నగరానికి ఏమైంది’. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నప్పుడు కూడా మా కాంపిటీషన్ మళ్లీ ఆడియన్సే. ప్రేక్షకుల అంచనాల గురించే నాకు భయం ఉంది. దీనికి ఎలాంటి ట్రైలర్ కట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఒక ఎపిక్ వెర్షన్‌లా ఉండాలని రూపొందించిన ట్రైలర్ ఇది. మీరందరూ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా రండి. థియేటర్లలో చాలా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
‘ఈ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా ఒక అద్భుతంలా అనిపించింది. చాలా గర్వంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అని చెప్పుకునే సినిమా ఇది. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో ఏడుస్తారు’ అని హీరో విశ్వక్ సేన్ చెప్పారు.
శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ, ‘ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాన్‌స్టాప్‌గా గూస్బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నగరానికి ఏమైంది సినిమా చూసినప్పుడు ఒక నటుడిగా కచ్చితంగా ఇలాంటి సినిమాల్లో భాగం కావాలనిపించింది. ఇందులో భాగం కావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది.కచ్చితంగా ఇది ఒక మంచి ఫన్ రైడ్’ అని తెలిపారు.
‘ఈ సినిమాను మీ అందరి ప్రేమ కోసం చేశాం. ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆ సినిమా తర్వాత ఎంతగానో అభిమానించారు. మీ అందరి ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ నగరానికి ఏమైంది ఫ్యాన్స్‌ను మరొకసారి మెప్పించడం అంత ఈజీ కాదు’ అని అభినవ్ గోమఠం అన్నారు.







కామెంట్లు (0)