Magazines

అనర్హులకు ఇండ్ల కేటాయింపులపై ఆందోళన

21 నిమిషాల క్రితం

Concerns over allocation of houses to the ineligible
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

సొంతిల్లు ఉన్నవారికే మళ్లీనా?

ఇందిరమ్మ ​కమిటీ ఏకపక్ష నిర్ణయాలపై

ప్రతిపక్ష నాయకుల ఆగ్రహం

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్

​యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రామపంచాయతీ తీర్మానాలు లేకుండానే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారని, లబ్దిదారుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాజకీయ పక్షపాతా నికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సీపీఐ(ఎం), బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయ కులు మాట్లాడుతూ.. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని విమర ్శించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు పొందినవారు, ప్లాట్లు తీసుకుని విక్రయించు కున్నవారు, ఇప్పటికే సొంతిండ్లు ఉన్నవారికి సైతం రెండో విడతలో ఇండ్లు కేటాయించడం బాధాకరమన్నారు. నిజమైన నిరుపేదలకు, ఇండ్లు లేని కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపం చాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాల సహకారంతో విజయం సాధించినప్పటికీ, గ్రామంలో కాంగ్రెస్‌కు చెందినవారే అన్ని నిర్ణయాలూ తీసుకుంటున్నారని, ఇతర పార్టీల నాయకులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీలు, లబ్దిదారుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన విద్యుత్ మీటర్లు, ఇతర అనుమ తులు, గ్రామపంచాయతీ పన్నుల చెల్లింపుల విషయంలోనూ లబ్దిదారులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని, అనర్హులకు కేటాయించిన ఇండ్లను పరిశీలించి నిజమైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఉపసర్పంచ్ ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కొంతం శ్రీనివాస్ రెడ్డి, బత్తుల సింహాద్రి, గునుగంటి స్వామి గౌడ్, వార్డు మెంబర్స్‌ పి‌శాటి దామోదర్ రెడ్డి, పిశాటి కిరణ్ రెడ్డి, జాల మల్లేష్, సురుకంటి లింగారెడ్డి, ఫకీర్ పెంటారెడ్డి, కొంతం ఎల్లారెడ్డి, జంగం అంజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్