Magazines

పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య

1 గంట క్రితం

Female home guard brut
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

తలను బండకేసి కొట్టి చంపిన భర్త

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన

​నవతెలంగాణ - నల్లగొండ

పోలీస్ క్వార్టర్‌లో ‌నివాసముంటున్న మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురైంది. భర్తనే ఆమె తలను బండకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ క్వార్టర్‌‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో మహబూబ్ బీ (43) హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో హోంగార్డుగా పనిచేసిన సతీష్ , మహబూబ్‌ ‌బీ 15 ఏండ్ల కిందటమతాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. బుధవారం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తరువాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం ముదరడంతో మహబూబ్ బీ తలను భర్త సతీష్ బండకేసి కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, రూరల్ ఎస్‌ఐ శివ ప్రసాద్, వన్‌టౌన్ ఎస్‌ఐ నాంపల్లి వెంకట్ నారాయణ పరిశీలించారు. నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తున్నట్టు పోలీసులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్