నవతెలంగాణ-హైదరాబాద్ : భారత మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో తొలిసారి హైదరాబాద్‌కు చెందిన రేసన్ ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్) టైటిల్ సాధించాడు. అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఎఫ్ఐఏ ఆసియా పసిఫిక్ ర్యాలీ చాంపియన్‌షిప్ (ఏపీఆర్సీ) 2026 ఓవరాల్ టైటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన రేసర్ జీత్ జబాఖ్ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ రేసింగ్‌లో ఈ ఏడాదే అరంగేట్రం చేసిన జీత్ జబాఖ్ సీజన్లో నిలకడగా రాణించి 73 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. న్యూజిలాండ్ ఒటాగో ర్యాలీ, సౌత్ ఇండియా ర్యాలీ, ఇండోనేషియా ర్యాలీలో జీత్ జబాఖ్ సత్తా చాటాడు. సహచర రేసర్ మూసా షెరిఫ్ సరైన దిశానిర్దేశం, ఇంజినీర్ల సహకారమే ఈ చారిత్రక విజయానికి కారణమని జీత్ సంతోషం వ్యక్తం చేశాడు.







కామెంట్లు (0)