Magazines

‌సిద్దిపేటలో పోటీ చెయ్‌ తేల్చుకుందాం

2 గంటల క్రితం

Siddipet
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌‌రావు సవాల్‌

కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్సే

299:512 నిష్పత్తికి ఒప్పుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా

నిరూపించకుంటే నువ్వు సిద్ధమా?అని ప్రశ్న


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ప్రసంగంలో అబద్ధపు మాటలు, టన్నుల కొద్దీ బూతులు మాత్రమే ఉన్నాయని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు విమర్శించారు. శుక్రవారం హైదరా బాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 26 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను తరలించి పార్టీ ప్లీనరీ పెట్టుకున్నారని చెప్పారు. పోలీసు కమిషనరే పార్కింగ్ స్థలాల పేరిట బయటకు వెల్లడించారని గుర్తు చేశారు. మూడేండ్ల పరిపాలనలో సర్వ విధాలా వైఫల్యం చెందారని విమర్శిం చారు. సమస్యల పరిష్కారంలో చేతులెత్తేసి, నీళ్లు ఎత్తిపోయక తెలంగా ణను కరువు రక్కసి పాలు చేసి.. ఆంధ్రా నీటి దోపిడీకి లోపాయికారిగా సహకరించారని అన్నారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, ప్రజల మీద కాంగ్రెస్ రుద్దిన కరువని చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అనిరు‌ ధ్‌రెడ్డి 20 శాతం కమీషన్ గురించి, పాలన సక్కగ లేదని రాజగోపాల్‌రెడ్డి ‌వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. నాడైనా, నేడైనా తెలంగాణకు ద్రోహ మే రేవంత్‌ విధానమని అన్నారు. ఆ వైఫల్యాన్ని, ద్రోహాన్ని కప్పిపుచ్చుకు నేందుకు సిద్దిపేట సభలో సర్కస్ ఫీట్లు చేశారని చెప్పారు. అభివృద్ధి, నిధుల గురించి కాకుండా తిట్ల ‌ దండకమేనని అన్నారు.

అప్పుడైనా ఇప్పుడైనా ఏపీ జలదోపిడీకి సహకరించి తెలంగాణకు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీయేననని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని అన్నారు. 299:512 వాటాల విషయంలో తాము సంతకం పెట్టామని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా?అని రేవంత్ రెడ్డికి సవాల్‌‌ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, ఆంధ్రప్రదేశ్ పాలకుల ముందు సాగిలపడిన వైఖరి వల్లే తెలంగాణకు 299 టీఎంసీల వాటాతో అన్యాయం జరిగింది నిజం కాదా?అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనీ, ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. సిద్దిపేటలో పోటీ చేయాలనీ, ప్రజల ముందే తేల్చుకుందామని సీఎం రేవంత్‌‌రెడ్డికి సవాల్‌ ‌విసిరారు. ప్రజలు ఎవర్ని ఆదరిస్తరో, ఎవర్ని చీదరిస్తరో తేలిపోతదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే తమ బాధ్యత అని చెప్పారు. సోయికి రాకుంటే ప్రజా పోరాటానికి సిద్ధపడతామనీ, న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సీనియర్ నాయకులు మన్నె గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్