Magazines

పరస్పర అంగీకారంతో విడిపోతున్న పవన్‌ కల్యాణ్, అనా కొణిదెల

1 రోజు క్రితం

Pawan Kalyan and Anna Konidela are parting ways by mutual consent.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం


ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన దంపతులు

స్నేహితులుగా, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటామని వెల్లడి

వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని మీడియా, అభిమానులకు విజ్ఞప్తి

నవతెలంగాణ-హైదరాబాద్‌ : - ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల (అన్నా లెజినోవా) పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, సోమవారం రాత్రి ఇరుపక్షాలు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ వారు విడుదల చేసిన అధికారిక ప్రకటన విదుధల చేసారు.

గౌరవప్రదంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం..
"మా జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయాన్ని కలిసి గడిపిన తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక జీవితం ముగిసినా, మేం మంచి స్నేహితులుగా ఉంటాం. మా చక్కని పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతాం. మా పిల్లల సంతోషం, శ్రేయస్సు మాకు ఎల్లప్పుడూ ఉమ్మడి ప్రాధాన్యంగా ఉంటాయి." అని పేర్కొన్నారు.

గోప్యతను గౌరవించండి..
తమ జీవితంలోని ఈ క్లిష్ట దశలో అందరి మద్దతును కోరుతూ.. "ఈ దశలో మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని, సానుభూతితో వ్యవహరించాలని, మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం. మా ప్రయాణంలో వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పవన్‌ కల్యాణ్‌ కొణిదెల, అనా కొణిదెల సంయుక్తంగా తమ ప్రకటనలో స్పష్టం చేశారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్