నవతెలంగాణ - హైదరాబాద్: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి మెడలో కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది ఆపై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారావు(22), మహేశ్వరి(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో మహేశ్వరిపై అనుమానం పెంచుకున్న చిన్నారావు ఆమెను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా శనివారం కత్తి తీసుకుని ఆమె మెడపై కోశాడు. దీంతో యువతి తీవ్ర రక్తశ్రావమై రోడ్డుపై పడిపోయింది. తరువాత భయంతో చిన్నారావు డాబాపై నుంచి దూకడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియురాలిపై కత్తితో దాడి.. ఆపై ప్రియుడు ఆత్మహత్య
14 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)