Magazines

యుద్ధ అధికారాల తీర్మానానికి సెనెట్ ‘నో’

3 గంటల క్రితం

resolution
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్ : ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్దేశిం చిన యుద్ధ అధికారాల తీర్మానాన్ని అమెరికా సెనెట్ గురువారం తిరస్క రించింది. మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాలకు ఇరాన్ యుద్ధం ఓ కారణమని తెలిసినప్పటికీ ఆ పోరును రిపబ్లికన్లు మరోసారి సమర్ధించుకున్నారు. ఈ తీర్మానాన్ని ప్రతినిధిసభ సెప్టెంబరులోనే ఆమోదిం చింది. మధ్యంతర ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో ఓటింగ్ జరిగిన మొట్ట మొదటి తీర్మానం ఇదే. సెనెట్‌లో తీర్మానానికి అనుకూలంగా 48 మంది సభ్యులు ఓటేయగా 51 మంది వ్యతి రేకించారు. పెన్సిల్వేనియాకు చెందిన డెమొక్రటిక్ సెనెటర్ జాన్ ఫెట్టర్‌మన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయగా రిపబ్లికన్ పార్టీకి చెందిన సూసన్ కాలిన్స్(మైన్), రాండ్ పాల్ (కెంటకీ), లిసా ముర్కోవ్‌స్కీ (అలాస్కా) అనుకూలంగా ఓటు వేశారు.

ఫిబ్రవరిలో అమెరికా- ఇజ్రా యిల్ సేనలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచీ డెమొ క్రాట్లు వరుసగా యుద్ధ అధికారాల తీర్మానాలను ప్రవేశపెడుతూనే ఉన్నారు. అయితే రిపబ్లికన్ సభ్యులు వీటిని ఓడిస్తూ వస్తున్నారు. అయితే జూన్‌లో ఓ తీర్మానం ఉభయసభలలో ఆమోదం పొందింది. ఈ వివాదానికి ముగింపు పలకడానికి 1973 నాటి చట్టాన్ని ఉపయోగించుకోవడానికి రిపబ్లికన్లు ప్రయత్నాలను కొనసా గించారు. సెనెట్ ముందుకు గురు వారం వచ్చిన తీర్మానానికి ఒక్కరు మినహా మిగిలిన డెమొక్రాట్లు అంద రూ మద్దతు తెలిపారు. అయితే ముగ్గురు మినహా రిపబ్లికన్లు అందరూ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన డెమొక్రటిక్ సెనెటర్ క్రిస్ మర్ఫీ ఓటింగుకు హాజరు కాలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్