చైనా సంసిద్ధత
టెహ్రాన్ : ఇరాన్‌తో బలమైన సంబంధాలను నెల కొల్పుకోవాలని చైనా భావి స్తోంది. మధ్యప్రాచ్యానికి చైనా ప్రతినిధిగా వ్యవ హరిస్తున్న జై జున్ ఇరాన్‌లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ అలీ బఘేరీ కనీతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్‌తో సంబంధాలపై బీజింగ్ ఆసక్తిని కనీకి జున్ తెలియజేశారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తలను తగ్గించేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇరాన్, ఒమన్, సౌదీ అరేబియా దేశాల్లో జున్ పర్యటిస్తున్నారు. హేతుబద్ధమైన, ఆచరణాత్మక దృక్పథంతో రాజకీయ పరిష్కారాలపై దృష్టి సారించాల్సి ఉన్నదని, తద్వారా ఈ ప్రాంతంలో సుస్థిరతను, అభివృద్ధిని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆయన సూచించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇప్పటికే ఇరాన్, సౌదీ అరేబియా జాతీయ భద్రతాధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. మధ్యప్రాచ్య ఘర్షణల్లో భాగస్వాములైన దేశాలన్నీ తిరిగి ఆయుధాలను చేపట్టే బదులు రాజకీయ పరిష్కారాలపై దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా కలిగే దుష్ప్రభావాలను ఎదుర్కోవడంలో ఆఫ్రికా దేశాలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలోనే చెప్పారు.
ఇరాన్‌తో బలమైన సంబంధాలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)