Magazines

మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ ఆస్వాదిస్తున్నా!

4 గంటల క్రితం

batting
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

సొంతగడ్డపై ఆడనుండటం గర్వంగా ఉంది
భారత వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ


నవతెలంగాణ-హైదరాబాద్‌
జాతీయ జట్టులో తిలక్‌ వర్మ రెండేండ్లకు పైగా రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తాజాగా టీ20 జట్టుకు వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు సైతం చేపట్టాడు. అయినా, భారత జట్టు తరఫున సొంత మైదానంలో తిలక్‌ వర్మ తొలిసారి బరిలోకి దిగనున్నాడు. తిలక్‌ వర్మ ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, సొంత మైదానంలో కుటుంబం, స్నేహితులు, అభిమానుల నడుమ ఆడనుండటం గర్వంగా ఉందని తిలక్‌ వర్మ అన్నాడు. బుధవారం మ్యాచ్‌ ముంగిట ఉప్పల్‌ స్టేడియంలో మీడియాతో తిలక్‌ వర్మ మాట్లాడాడు. 'హైదరాబాద్‌లో ఆడనుండటం గర్వంగా ఉంది. జాతీయ జట్టు తరఫున, వైస్‌ కెప్టెన్‌గా సొంత మైదానంలో నాకు ఇదే తొలి మ్యాచ్‌. నాతో పాటు ఐపీఎల్‌లో అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలకు సైతం ఇక్కడ ఆడిన అనుభవం ఉందని' తిలక్‌ అన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా ఉండగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నం.3 స్థానం నాయకుడిని అడిగి తీసుకున్న తిలక్‌ వర్మ... వరుస సెంచరీలతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు 3, 4వ స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తుండగా, తిలక్‌ వర్మ ఐదో స్థానంలో బ్యాట్‌ పడుతున్నాడు. 'మూ డో స్థానంలో బ్యాటింగ్‌ నాకు ఇష్టం. ఈ విషయం ఎన్నో సార్లు చెప్పాను. నం.3 పొజిషన్‌లో బ్యాటింగ్‌ చేస్తే పవర్‌ప్లేలో ఆడే అవకాశం వస్తుంది. అప్పుడు స్వేచ్ఛగా షాట్లు ఆడవచ్చు. కానీ జట్టు నా నుంచి ఏం ఆశిస్తుందో ఆ బాధ్యత నిర్వర్తిం చేందుకు సిద్ధం. మిడిల్ ఆర్డర్‌లో ప్రస్తు తంనా బ్యాటింగ్ ఆస్వాదిస్తున్నా. నం.5-7 వరకు మ్యాచ్‌ పరిస్థితులకు తగినట్టు ఆడుతున్నాను. త్వరగా వికెట్లు పడితే కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకుంటాను. టాప్‌ ఆర్డర్‌ 15వ ఓవర్‌ వరకు ఆడితే, అప్పుడూ ఎలా ఆడాలో తెలుసు. రెండు విధాల ఆట ఆడేలా మైండ్‌సెట్‌ సిద్ధం చేసుకున్నా. ప్రస్తుతానికి అంతా బాగుంది, నేను ఎంజాయ్‌ చేస్తున్నాను' అని తిలక్‌ వర్మ తెలిపాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్