నవతెలంగాణ - హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా పుంజుకున్నాయి. 14 నెలల కనిష్ఠ స్థాయి నుంచి కోలుకున్న బంగారం ధర 10 గ్రాములపై రూ.2 వేల మేర పెరగగా, కిలో వెండి ధర రూ.3 వేల పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.29 లక్షలు, 22 క్యారెట్ల ధర రూ.1.17 లక్షలుగా ఉంది. కిలో వెండి ధర రూ.1.56 లక్షలకు చేరింది. షార్ట్కవరింగ్, పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ పెరగడం, ధరలు తగ్గడంతో కొనుగోళ్లు ఊపందుకోవడం, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై అంచనాలు ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు.







కామెంట్లు (0)