Magazines

భూ కబ్జాకు యత్నిస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి

1 గంట క్రితం

Strict action if attempts are made to encroach upon land: CM Revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిని కాపాడేందుకు కేసీఆర్‌ సర్కారు ప్రయత్నం చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి రూ.50వేల కోట్ల ఆస్తిని కాపాడుకోగలిగామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. అవసరమైతే వాటిని వేలం వేసి.. దళిత బహుజనుల కోసం ఖర్చు చేస్తామన్నారు. భూ కబ్జాకు యత్నిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్