అభినందించిన గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్
నవతెలంగాణ - మల్హర్ రావు
వరల్డ్ టూరిజండే సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన మండలం పాత రుద్రారం గ్రామానికి చెందిన కమ్మల ప్రజ్ఞను ప్రముఖ రచయిత వరంగల్ శ్రీనివాస్ మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించడం ప్రజ్ఞకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
సంగీత రంగంలో తన ప్రతిభను చాటుకుని బహుమతి సాధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి విజయాలు కళాకారుల్లో మరింత ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని తెలిపారు. ప్రజ్ఞ భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయి విజయాలు సాధించాలని, తన గాన ప్రతిభతో మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఆమె కళారంగంలో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు. అనంతరం శాలువాతో ఘనంగా ప్రజ్ఞను సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాడి మల్లయ్య, ప్రజ్ఞ కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్, లక్ష్మి వివేక్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)