ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ఆమె పేరుతోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. గౌరి నాయుడు జమ్ము దర్శకుడు.
టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే నిర్వహించిన ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, ‘మా బ్యానర్ నుంచి ఈ సినిమా ఓ కొత్త రకమైన ప్రయత్నం. మా అమ్మాయి మొదట ప్రారంభించిన సినిమా ఇది. గత పది రోజులుగా ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ప్రేక్షకులు కూడా 17వ తేదీన మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటు న్నాను. దసరా పండక్కి ఈ సినిమా కచ్చితంగా నిలబడ గలదని నమ్ముతున్నాం. మా సంస్థలో ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ.
కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇలాంటి సినిమాలు కూడా చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ‘గరివిడి లక్ష్మి’ సినిమాను ఇప్పటివరకు దాదాపు 15 సార్లు చూసి ఉంటాను. చూసిన ప్రతిసారీ అదే ఎమోషన్ క్రియేట్ చేసింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది’ అని అన్నారు.
‘సినిమా చూసిన అందరి కళ్లల్లో నీళ్లు చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చూసిన అందరూ తెర మీద పూర్తిగా గరివిడి లక్ష్మి పాత్రే కనిపిం చిందని చెప్పారు. ఒక నటిగా అది నాకు చాలా సంతృప్తినిచ్చింది’ అని హీరోయిన్ ఆనంది చెప్పారు.
‘ప్రీమియర్ షోలో సినిమా చూసిన అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాళ్ల స్పందన చూస్తుంటే మాకు చాలా ఆనందం కలిగింది. సినిమా అత్యంత గొప్ప అను భూతిని కలిగించిందని, తమను ఎమోషనల్ చేసిందని చెప్తుంటే హ్యాపీగా అనిపించింది. ప్రేక్షకులం దరూ మా సినిమాను ప్రోత్సహి స్తారని కోరుకుంటున్నాను. గరివిడి లక్ష్మి పాత్రకు ఆనంది 100% న్యాయం చేసిందని కచ్చితంగా చెప్పగలను’ అని తెలిపారు.
ప్రేక్షకుల మనసుని గెలుచుకునే సినిమా
5 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)