Magazines

అంతుచిక్కని రహస్యాల నేపథ్యంలో..

5 గంటల క్రితం

mysteries
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

ఆది సాయికుమార్ హీరోగా త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రొడక్షన్ నెం.3గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ జి రుద్రప్ప నిర్మిస్తున్నారు. నవరసన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. దైవిక రహస్యాల నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. ఆధ్యాత్మికత, విశ్వాసం, ప్రాచీన నమ్మకాలు, అంతుచిక్కని రహస్యాలతో కూడిన విభిన్నమైన సినీ ప్రపంచాన్ని పరిచయం చేయనుంది. అద్భుతమైన కథనం, బలమైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించడమే లక్ష్యంగా చిత్ర బృందం ఈ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ డార్క్, మిస్టరీ వాతావరణంతో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అతీంద్రియ రహస్యాలతో ముడిపడిన కథను ఈ పోస్టర్ సూచిస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ అప్‌డేట్‌ను ఈనెల 20న వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆది సాయికుమార్ భాగం కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ స్థాయిలో, ప్రత్యేకమైన విజువల్ స్టయిల్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘కాంతార’, ‘విరూపాక్ష’, ‘మంగళవారం’ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం సమకూరుస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్