డీజీపీకి హైకోర్టు ఆదేశం
కోర్టు ధిక్కరణ కేసులో రంగనాథ్ అభ్యర్థన తిరస్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ వ్యక్తిగత హాజరు మినహాయింపు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరిం చింది. 17న ఆయనను కోర్టుకు హాజరు పరిచేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అదే రోజు శంషాబాద్ తహసీల్దార్‌ను హాజరు పరిచేలా చూడాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు సూచించింది. శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబరు 626/2ఏఏలోని ప్రయివేటు భూమిని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారంటూ మహమ్మద్ తాజమలుద్దీన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. బోర్ల తవ్వకాల నియంత్రణ విధుల్లో ఉన్నందున హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కమిషనర్ కోరగా, అధికారిక విధుల కారణంగా మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.







కామెంట్లు (0)