Magazines

ఇండిగో విమానంలో మరోసారి పవర్‌ బ్యాంక్‌ కలకలం

11 గంటల క్రితం

Power bank chaos on another IndiGo flight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్‌ బ్యాంక్‌ కలకలం రేపింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో టేకాఫ్‌కు సిద్ధమైన సమయంలో పవర్‌ బ్యాంక్‌ను గుర్తించిన పైలట్‌ అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని రన్‌వే నుంచి వెనక్కి మళ్లించి బే వద్ద నిలిపివేశారు. పవర్‌ బ్యాంక్‌ను తొలగించిన అనంతరం విమానం శ్రీనగర్‌కు బయలుదేరింది. విమాన ప్రయాణ నిబంధనల ప్రకారం పవర్‌ బ్యాంకులను చెక్‌-ఇన్‌ లగేజీలో ఉంచడం నిషేధం. ఇటీవల మరో విమానంలో పవర్‌ బ్యాంక్‌ పేలి మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్