Magazines

పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట

13 గంటల క్రితం

Relief for Rahul Gandhi in defamation case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఊరట లభించింది. ‘చోర్‌ కీ సర్దార్‌’ అంటూ మోడీపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఓ బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన కేసులో ఆయనకు మెజిస్ట్రేట్‌ కోర్టులో ఉపశమనం లభించలేదు. దీంతో రాహుల్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయలేమంటూ గత నెల 8న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్